కొనుగోళ్లపై రైతులు ఆందోళన చెందొద్దు 

కొనుగోళ్లపై రైతులు ఆందోళన చెందొద్దు 

విశ్వంభర, సిద్దిపేట: రైతులు మార్కెట్ యార్డులకు తీసుకొచ్చిన ప్రతీ ధాన్యం గింజను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని బుధవారం ఆర్డీవో సదానందంను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అత్తు ఇమామ్ మాట్లాడుతూ, తడిసిన ధాన్యాన్ని  ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని కోరారు. రైతులు ఎవరు ఆందోళన చెందొద్దని, తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ రైతులను తప్పుదోవ పట్టిస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ రైతు సంక్షేమ ప్రభుత్వమని బీజేపీ, బీఆర్ఎస్ ఎన్ని డ్రామాలు చేసిన రైతులు ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరన్నారు. వచ్చే మరో 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని, అన్నీ వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం అవుతుందన్నారు. కార్యక్రమంలో గ్యాదరి మధు, గాయాజుద్దీన్, హర్షద్, దస్తగిరి, ముదసిరి తదితరులు పాల్గొన్నారు.

🕒 28 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/farmers-should-not-worry-about-purchases/article-15992

Tags: