వనజీవి రామయ్య  చిత్ర యూనిట్ ను అభినందించిన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా

విశ్వంభర, బషీర్ బాగ్: జాతీయ అవార్డు గెలుచుకున్న వనజీవి రామయ్య సినిమా బృందం తెలంగాణ గవర్నర్‌ శివ్ ప్రతాప్ శుక్లా ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో “వనజీవి రామయ్య” సినిమా యూనిట్ తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ను చిత్ర దర్శకుడు వేముగంటి, నిర్మాత లింగంపల్లి చంద్రశేఖర్, హీరోయిన్ నాగరాణి లు కలిసి ఇటీవల ఈ చిత్రానికి లభించిన జాతీయ అవార్డు సందర్భంగా ఆనందాన్ని ఆయనతో పంచుకున్నారు. పర్యావరణ పరిరక్షణ, చెట్ల సంరక్షణ, ప్రకృతి ప్రేమ వంటి గొప్ప సందేశాలను సమాజానికి అందించిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం తెలంగాణకు గర్వకారణమని గవర్నర్  ప్రతాప్ శుక్లా అభినందించారు. ఈ సందర్భంగా సినిమా యూనిట్ సభ్యులు అవార్డును గవర్నర్ కు చూపించి, చిత్ర నిర్మాణంలో ఎదురైన అనుభవాలను వివరించారు. “వనజీవి రామయ్య” జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ప్రజల్లో పర్యావరణంపై అవగాహన పెంచడంలో ముఖ్య పాత్ర పోషించిందని వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ జాతీయ అవార్డు తమ కృషికి వచ్చిన గౌరవమని, ప్రకృతి సంరక్షణ సందేశాన్ని మరింత విస్తృతంగా ప్రజలకు చేరవేయడానికి ఇది ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేమరామెన్ తోట రమణ, సంగీత దర్శకుడు బల్లేపల్లి మోహన్, సినీగేయ రచయిత ఘనయాది తదితరులు పాల్గొన్నారు.

🕒 28 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/governor-shiv-pratap-shukla-congratulated-vanajeevi-ramaiah-film-unit/article-16038

Tags: