ఎన్‌టీఆర్ జాతీయ కీర్తి ప్రతీక: మధుసూదనాచారి
విశ్వంభర, చిక్కడపల్లి : తెలుగు జాతి కీర్తిని జాతీయ స్థాయిలో నిలిపిన మహానేత ఎన్‌టీఆర్ అని ఆయన సేవలను శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి కొనియాడారు. హైదరాబాదులోని శ్రీ త్యాగరాయ గానసభలో కళా సుబ్బారావు కళావేదికపై నిర్వహించిన ఎన్‌టీఆర్ జయంతి సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విలక్షణ పౌరాణిక పాత్రలతో చిత్ర పరిశ్రమలో ఉత్తమ నటుడిగా, పేదల సంక్షేమానికి కట్టుబడి ప్రజల ముఖ్యమంత్రిగా అనేక పథకాలు అమలు చేసి యెన్‌టీఆర్ ప్రత్యేక స్థానం సంపాదించారని పేర్కొన్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని చెప్పారు. తన రాజకీయ ప్రస్థానంలో తొలి అవకాశాన్ని శాసనసభకు పోటీ చేసే విధంగా కల్పించిన వ్యక్తి యెన్‌టీఆర్ అని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమానికి గానసభ అధ్యక్షుడు కళా జనార్థన మూర్తి అధ్యక్షత వహించారు. సాహితీ కిరణం సంపాదకుడు పొత్తూరి సుబ్బారావు, సంఘ సేవకులు నైషధం సత్యనారాయణ, భవాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.