దున్నపోతుతో ఆటో ర్యాలీ.. పెట్రోల్, డీజిల్ ధరలపై నిరసన

విశ్వంభర, అంబర్‌పేట : పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం కార్యకర్తలు అంబర్‌పేటలో వినూత్న నిరసన చేపట్టారు. సీపీఎం అంబర్‌పేట కన్వీనర్ మహేందర్ ఆధ్వర్యంలో హైదరాబాదు తిలక్‌నగర్ నుంచి చే నెంబర్ చౌరస్తా వరకు ఆటోకు దున్నపోతును కట్టి ర్యాలీ నిర్వహించారు. పదిరోజుల్లో నాలుగు సార్లు ధరలు పెంచడాన్ని తీవ్రంగా ఖండించిన కార్యకర్తలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ధరల పెంపుతో ప్రజలపై భారాన్ని మోపుతున్నారని, కార్పొరేట్ ప్రయోజనాలకే విధానాలు అమలవుతున్నాయని మహేందర్ ఆరోపించారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ దేశంలో మాత్రం పెంపులు కొనసాగడం అన్యాయమన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోవడం ప్రజలను మోసం చేసినట్టేనని విమర్శించారు. పెంచిన ధరలను తగ్గించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యురాలు వై వరలక్ష్మి, జోన్ కమిటీ సభ్యులు జి రాములు, షబానా, అఖిల్, సుబ్బారావు, ఏసు, శ్రీనివాస్, రాయిస్, జెమిస్ పాల్గొన్నారు.

🕒 28 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/auto-rally-protest-against-petrol-diesel-prices-with-ploughing/article-15984

Tags: