ఆర్చక సంక్షేమ నిధి చెక్కులను అందించిన మంత్రి కోండా సురేఖ
విశ్వంభర, జిహెచ్ఎంసి : తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో చెల్లించి వారికి అండగా నిలుస్తున్నదని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ అన్నారు. బుధవారం బంజార హిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సురేఖ 12 మంది మాజీ అర్చక ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ‘అర్చక సంక్షేమ నిధి’ నుంచి రిటైర్మెంట్ గ్రాట్యుటీ, డెత్ గ్రాట్యుటీ ప్రయోజనాలను మొత్తం రూ. 71,20,000 లను చెక్కుల రూపంలో స్వయంగా అందించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం దేవాదాయశాఖ పరిధిలో దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులు, ఉద్యోగులకు పదవీ విరమణానంతరం లేదా మరణానంతరం చెల్లించే గ్రాట్యుటీ మొత్తాన్ని రూ. 4 లక్షల నుంచి 8 లక్షలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో వున్న ఈవోల సీనియారిటీ, ప్రమోషన్ల ఫైల్స్ ను క్లియర్ చేయడం ద్వారా దేవాలయాల నిర్వహణ సమర్థవంతంగా సాగేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా రాష్ట్రంలోని దేవాలయాలను ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంత రావు, ఎడిసి కృష్ణవేణి, ఆర్జెసి రామకృష్ణారావు, ఇతర ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.