మహిళల కళ్లల్లో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యం

  •  కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకే ఇందిరా మహిళా శక్తి 
  •  ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

విశ్వంభర, సూర్యాపేట: మహిళల ఆర్థికాభివృద్ధి, సాధికారతే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 22, 23 వార్డుల్లో నిర్వహించిన ఇందిరమ్మ నారీ శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం మహిళల కళ్లల్లో ఆనందం చూడాలనే సంకల్పంతో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఇందిరమ్మ పేరుతో మహిళలకు చీరలు పంపిణీ చేయడం గర్వకారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సూర్యాపేటకు ఇప్పటికే 38,500 చీరలు సిద్ధంగా ఉన్నాయని, అవసరమైతే మరిన్ని కూడా తీసుకువస్తామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నమైన పాలపిట్ట రంగుతో రూపొందించిన ఈ చీరలు మహిళల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అన్నారు. ప్రతి అర్హ త గల మహిళకు చీర అందేలా కౌన్సిలర్లు, ఆర్పీలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.మహిళ ఓ శక్తి మాత్రమే కాదని, ఆలోచన ఉన్న వ్యక్తి అని, కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టే శక్తి మహిళకే ఉందన్నారు. మహిళా సంఘాలకు డైరీ ఫామ్‌లు, గోదాములు, రైస్ మిల్లుల నిర్వహణ వంటి అవకాశాలను ప్రభుత్వం కల్పించేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు.సూర్యాపేటలో 27 వేల మహిళా సంఘాలు 95 నుంచి 100 మంది ఆర్పీలు పనిచేయడం ఇక్కడ మహిళల్లో ఉన్న చైతన్యానికి నిదర్శనం అని కొనియాడారు. దామన్న బిడ్డగా తాను ఇక్కడే అందరికీ అందుబాటులో ఉంటున్నానని ఏ అర్ధరాత్రి ఆపద వచ్చిన ఆడపిల్లలకు అండగా కొట్లాడుతానన్నారు. సూర్యాపేటలో వేలాది మహిళా సంఘాలు, వందకు చేరువలో ఆర్పీలు పనిచేయడం మహిళల్లో ఉన్న చైతన్యానికి నిదర్శనమన్నారు. మహిళలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ హన్మంతరెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ యండి షఫీ ఉల్లా, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యండి అంజద్ అలి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్,కౌన్సిలర్లు ఎల్గురి అలివేలు చంటిబాబు, వల్దాసు లక్ష్మి శ్రీను,మెప్మా ఆర్పీలు, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

🕒 28 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/governments-aim-is-to-see-happiness-in-womens-eyes/article-16017

Tags: