రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి

  • అదనపు కలెక్టర్ కె. అనిల్ కుమార్

విశ్వంభర, మహబూబాబాద్:  జూన్ రెండవ తేదీన కలెక్టరేట్ కార్యాలయంలో  రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం కోసం ఏర్పాట్లు  చేయాలని సంబంధిత అధికారులకు అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ అదనపు కలెక్టర్ ఛాంబర్ లో సంబంధిత అన్ని విభాగాల అధికారులతో ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించే వేడుకలలో ప్రోటోకాల్ ప్రకారం అతిధులకు అన్ని ఏర్పాట్లు చేయాలని, ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల పురోగతిపై ప్రసంగం కాపీని సిద్ధం చేయాలని, వేదిక, సీటింగ్, స్నాక్స్, సౌండ్స్, లైటింగ్, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు ఇతర ఇబ్బందులు లేకుండా పోలీస్ విభాగం చర్యలు తీసుకోవాలని, వేదిక ప్రాంగణంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని, త్రాగునీరు సిద్ధంగా ఉంచాలని, సానిటేషన్ చేయాలని సూచించారు. సంబంధిత అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో కలిసి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం కోసం ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో  అన్ని విభాగాల జిల్లా అధికారులు, సెక్షన్ సూపర్డెంట్ రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

🕒 28 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-states-inauguration-day-celebrations-should-be-held-in-a/article-15980

Tags: