అకాల వర్షాలతో తడిసినా ధాన్యం కొంటాం
- రైతులకు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ భరోసా
- మిల్లుల వద్ద అన్‌లోడింగ్ ఆలస్యమైతే చర్యలు
ఎస్పీ నరసింహతో కలిసి కొనుగోలు కేంద్రాల ఆకస్మిక తనిఖీ
విశ్వంభర, సూర్యాపేట: ధాన్యం సేకరణ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న అడ్డంకులను అధిగమిస్తూ, ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన జిల్లా ఎస్పీ కే. నరసింహతో కలిసి ఆత్మకూరు (ఎస్) మండల కేంద్రంలోని పివైఆర్ రైస్ మిల్లును, ఏపూరు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. క్షేత్రస్థాయిలో కొనుగోలు తీరును, తూకాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు ధాన్యం కొనుగోళ్లలో ప్రధానంగా ఎదురవుతున్న లారీల కొరత, హమాలీల ఇబ్బందులు మరియు అన్‌లోడింగ్ ఆలస్యం వంటి సమస్యలను గుర్తించామని, వాటి పరిష్కారానికి యుద్ధప్రతిపాదికన చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. రవాణా, పోలీస్ శాఖల సమన్వయంతో అన్ని రకాల వాహనాలను ధాన్యపు రవాణాకు మళ్లించడం జరుగుతుందని, ప్రతి రైస్ మిల్లుకు ఒక ప్రత్యేక ఇన్‌ఛార్జ్ నియామకం, అదనపు హమాలీల ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుత అకాల వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అలర్ట్ మెకానిజం'సిద్ధం చేసిందని కలెక్టర్ తెలిపారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిస్తే రైతులు అస్సలు ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్ని వెంటనే గుర్తించి, బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించేలా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుందని. రైతులకు నష్టం జరగనివ్వమని కలెక్టర్ అన్నారు. రెవెన్యూ, సివిల్ సప్లై, పోలీస్ శాఖలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ ధాన్యం సేకరణను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక కోఆర్డినేటర్లు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట డిఆర్డిఓ సన్యాసయ్య ఆత్మకూర్ (ఎస్) తహసిల్దార్ హామీన్ సింగ్, ఎంపీడీవో అసీం అలీ, ఏవో దివ్య ఇతర స్థానిక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.