జీలుగు విత్తనాల పంపిణీ ప్రారంభం

జీలుగు విత్తనాల పంపిణీ ప్రారంభం

విశ్వంభర, హుస్నాబాద్ : హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో జీలుగు విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని సంఘం చైర్‌పర్సన్ ఇంచార్జి బిల్ల వెంకట్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించి అధిక దిగుబడులు సాధించే దిశగా సహకార సంఘం కృషి చేస్తోందన్నారు. రైతులు శాస్త్రీయ విధానాలతో సాగు చేపట్టి ప్రభుత్వ సూచనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెన్నంపల్లి సర్పంచ్ మోలుగురి చిరంజీవి, డైరెక్టర్లు సారాబుడ్ల రాజిరెడ్డి, గుండేటి శ్రీనివాస్, సిహెచ్ రాజేశ్వర్‌రెడ్డి, మోలుగురి సంపతి, కౌడగాని మోహన్‌రావు, దొనపాటి రామ్‌రెడ్డి, ఆరేపల్లి ఉప సర్పంచ్ వెంగళ రవి, వర్నె మోహన్‌రావు, రైతులు నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

🕒 28 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/commencement-of-distribution-of-cumin-seeds/article-16013

Tags: