తహసిల్దార్ కార్యాలయంలో జెసి సమీక్ష
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకా రెడ్డి, చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో బుధవారం ధాన్యం కొనుగోళ్ళ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ, ధాన్యం కొనుగోళ్ళను వేగవంతం చేయాలని, ధాన్యం తరలింపుకు తగినన్ని లారీలను కూడా సిద్ధం చేయాలని, రైతులను ఇబ్బందికి గురి చేయొద్దని అధికారులకు సూచించారు. ధాన్యం కాంటా అవగానే రైతు బాధ్యత ఉండదని ధాన్యం కొనుగోలు కేంద్రాల మార్కెట్ కమిటీలదే బాధ్యత అని, ఏమయినా తరుగు లాంటివి వచ్చినా, కమిటీలే చూసుకోవాలని, రైతులను మిల్లుల దగ్గరికి పంపి ఇబ్బందులకు గురి చేయొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ లాల్ బహదూర్, ఇతర సంబందిత అధికారులు, వివిధ పార్టీల నాయకులు, రైతులు, పాత్రికేయులు పాల్గొన్నారు.