దేశ నిర్మాణంలో నెహ్రూ సేవలు అమోఘం
- ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
విశ్వంభర, సూర్యాపేట: బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 22వ వార్డు చౌరస్తాలో నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్య్రం అనంతరం దేశాభివృద్ధికి నెహ్రూ బలమైన పునాదులు వేశారని తెలిపారు. పరిశ్రమలు, విద్యాసంస్థలు, ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేయడంలో ఆయన పాత్ర విశేషమని కొనియాడారు. శాస్త్రీయ దృక్పథంతో దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించిన మహానేత నెహ్రూనేనని పేర్కొన్నారు. ఐఐటీలు, పరిశోధనా సంస్థలను స్థాపించి యువతకు కొత్త అవకాశాలు కల్పించారని, నేడు భారత్ ప్రపంచస్థాయిలో ఎదగడానికి ఆయన దూరదృష్టే కారణమని అన్నారు. దేశం కోసం కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ కుటుంబం చేసిన త్యాగాలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని తెలిపారు.నెహ్రూ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి చకీలం రాజేశ్వరరావు,మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజద్ ఆలీ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరి కుంట్ల వేణుగోపాల్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.