అకాల వర్షాలకు నేలమట్టమైన ఇండ్లను పరిశీలించిన ఆర్ఐ
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఉత్తటూరు గ్రామంలో మంగళవారం కురిసిన అకాల వర్షానికి ఈదురు గాలులకు గ్రామంలో ఉయ్యాల యాదమ్మ, జట్టి వెంకన్న, పొనుగోటి రజిత, ఏనుగు మాధవరెడ్డి తదితరుల ఇండ్లు నేలమట్టమైనాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న రామన్నపేట మండల ఆర్ఐ శోభ గ్రామంలో పర్యటించి నేలమట్టమైన ఇండ్లను పరిశీలించి, ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి, లబ్ధిదారులకు న్యాయం జరిగేలా నివేదిక అందిస్తానని, నష్టపరిహారం వచ్చే విధంగా న్యాయం చేస్తానని తెలిపినారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోళ్ల రామకృష్ణ, జిపిఓ నరసింహ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.