ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి.
-నివాళులు అర్పించిన ఈగ మల్లేశం
విశ్వంభర, హన్మకొండ జిల్లా: తెలుగు ఉమ్మడి రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి, తెలుగు వారి గుండెల్లో అన్నగారిగా సుస్థిర స్థానం సంపాదించుకున్న యుగపురుషుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ,నటరత్న స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతిని పురస్కరించుకొని పబ్లిక్ గార్డెన్ దగ్గర వారి విగ్రహానికి అఖిలభారత సీనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం గౌరవ అధ్యక్షులు, కేంద్రఖాదీ చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారిని స్మరించుకుంటూ..కేవలం నటుడిగానే కాకుండా, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టి, అతి తక్కువ సమయంలోనే చరిత్ర సృష్టించిన రాజకీయ దిగ్గజం అని కొనియాడారు. రెండు రూపాయలకే కిలో బియ్యం, పేదలకు పక్కా ఇళ్ళు, మద్యపాన నిషేధం, మహిళలకు ఆస్తి హక్కు వంటి ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని ప్రజా సంక్షేమానికి బాటలు వేశారు.తెలుగు నేల ఉన్నంత వరకు, తెలుగు భాష ఉన్నంత వరకు అన్నగారు మనందరి గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోతారని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.తెలుగు నేల పైన తొలిసారి ఎస్సీ, ఎస్సీ, బీసీ మైనారిటీ లకు రాజకీయ అవకాశాలు కల్పించిన ఏకైక వ్యక్తి అని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు.కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఎన్.టి.ఆర్ చేసిన సేవ కార్యక్రమాలను గుర్తించి వారికి *భారత రత్న* అవార్డును ప్రకటించాలని ఈ సందర్భంగా వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో పుట్ట రజనీకాంత్,చాడ మరియమ్మ, రహీమ్,ముక్కిరాల జనార్ధన్, హన్మకొండ సాంబయ్య, పిట్టల శ్రీనివాస్,ముంజ వెంకట్రాజం గౌడ్, మాదాసి బాబు, కందుకూరు నరేష్, రవీందర్ గుప్తా, బైరపాక ప్రభాకర్, యాకుబ్, కాగితాల శంకర్,అనిల్, చంద్ర మోహన్, తదితరులు పాల్గొన్నారు.