ప్రజా దర్బార్ లో వచ్చిన ప్రతి దరఖాస్తుకు పరిష్కరించాలి 

  • 100 రోజుల పనులు, గ్రామీణ అంతర్గత అభివృద్ధి, సీసీ రోడ్లు, చెక్ డ్యాములు రోడ్ల పనుల్లో వేగం పెంచాలి
  • రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి  సీతక్క

విశ్వంభర, మహబూబాబాద్: బుధవారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, ఎస్పీ డాక్టర్ శబరిష్, డీఎఫ్ఓ విశాల్ బత్తుల, ఆర్డిఓ క్రిష్ణవేణి, జడ్పీ సీఈవో పురుషోత్తం, జిల్లాస్థాయి ఉన్నతాధికారులందరితో కలిసి మహబూబాబాద్ జిల్లా ములుగు నియోజకవర్గ పరిధి కొత్తగూడ ఏజెన్సీ ఓటాయి, కొత్తగూడ మండల కేంద్రం లో రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ప్రజా దర్బార్‌లో వచ్చిన
 సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, అధికారులకు మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామపంచాయతీ సర్పంచులు, సూచించిన సమస్యల పరిష్కారం నిమిత్తం వెంటనే కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు ఆదేశాలు తగ్గు సూచనలు జారీ చేశారు, ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి సంబంధిత విభాగానికి పంపి అర్హులైన ప్రతి ఒక్కరిని గుర్తించి సంక్షేమ ఫలాల పథకాల ద్వారా లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం సుమారు 60 వేల 400 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను అందించడం జరుగుతుందని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ లబ్ధిదారులు మహిళా సంఘాలలో సభ్యులుగా ఉంటే ఆర్థిక భరోసా కింద లక్ష రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. 
గతంలో ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగిందని, ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను అందిస్తున్నామని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో 100 రోజుల పనులలో అధికంగా కూలీలు పాల్గొని వేగంగా ఆ పనుల్లో నిమగ్నం కావాలని తద్వారా మీ యొక్క ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళల ఆత్మ గౌరవం నిమిత్తం మహిళా సమైక్య భవనాలను నిర్మించడం జరుగుతుందని, అందులో భాగంగానే మండల పరిధిలో ఇప్పటికే 40 భవనాల నిర్మాణ శంకుస్థాపనలు చేయడం జరిగిందని, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పాలపిట్ట రంగులో చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగిందని ఇప్పుడు చిలకపచ్చ రంగులు అద్భుతంగా చీరలను అందించడం జరుగుతుందన్నారు. రైతుల పొలాల వద్దకు వెళ్లడం కోసం రహదారుల నిర్మాణం లో ఫారెస్ట్ అధికారులు రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రోడ్లు నిర్మించాలని తెలిపారు. పేదవాడి సొంత ఇంటి నిర్మాణ కలను సాకారం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని అందులో భాగంగానే జిల్లాకు వచ్చిన కోటాకు అదనంగా మరో రెండు వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం కోసం  చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. జిల్లాలోని ఇండ్లు నిర్మించుకోలేని పరిస్థితిలో ఉన్న వారి సౌకర్యార్థం ఒక సంస్థ ద్వారా ఇండ్లు నిర్మించుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో కరెంటు సమస్యలను తీర్చడం కోసం ఉపముఖ్యమంత్రి  చేత ప్రత్యేకంగా కరెంటు స్తంభాలకు  నిధుల మంజూరు చేయించడం జరిగిందని ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నాణ్యమైన కరెంటును అందించాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క స్వయంగా ప్రజల సమస్యలను ఓపికగా వింటూ దరఖాస్తులను స్వీకరించారు. అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యల తీవ్రతను అడిగి తెలుసుకున్నారు.  ప్రజా దర్బార్‌లో ప్రధానంగా ఇండ్ల స్థలాలు, ఆసరా పెన్షన్లు, భూమి సమస్యలు, రేషన్ కార్డులు, గ్రామాల్లో రోడ్లు, తాగునీరు మరియు ఆరోగ్య సహాయం వంటి పలు అంశాలపై ప్రజలు మంత్రికి వినతి పత్రాలు అందజేశారు. ప్రజల నుండి వచ్చిన కొన్ని దరఖాస్తులను మంత్రి సీతక్క గారు అక్కడికక్కడే పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులకు బదిలీ చేశారు. ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించకుండా, చట్టపరిధిలో ప్రతి అర్జీని వీలైనంత త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.  ప్రజా ప్రభుత్వం. లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా, పాలనను ప్రజల వద్దకే తీసుకురావాలన్నదే మా సంకల్పం. ప్రతి ఒక్కరి దరఖాస్తును పరిశీలించి, అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు, న్యాయం చేకూరేలా చూస్తాం" అని హామీ ఇచ్చారు. తమ సమస్యలను నేరుగా మంత్రి కి చెప్పుకునే అవకాశం కల్పించడంపై, అలాగే మంత్రి సీతక్క చూపిన చొరవ, ఆప్యాయతపై ప్రజా దర్బార్‌కు వచ్చిన ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరిష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రత్యేక చొరవతో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రజలకు మరింత సేవ చేయాలనే మంచి ఉద్దేశంతో నిర్వహించడం జరిగిందని ఈ ప్రజా దర్బారు ద్వారా వచ్చిన ప్రతి ఒక్క దరఖాస్తును పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలను అందించి వారికి న్యాయం చేయడం కోసం జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రతి అంశాన్ని అతి ప్రాధాన్యతగా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియలో ప్రైవేటు సంస్థతో ఒప్పందం చేసుకొని లబ్ధిదారులకు ఇండ్లు నిర్మించి ఇచ్చుట కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో చెక్ డ్యాములు రోడ్లు కరెంటు లైట్లు, తదితర అంతర్గత అభివృద్ధి పనుల పై ప్రత్యేక చర్యలు తీసుకొని ముందుకు సాగుతామని మంత్రి కి తెలిపారు. అనంతరం కొత్తగూడ మండల పరిధిలో ట్రైబల్ వెల్ఫేర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి నా పిల్లలను మంత్రి సన్మానించారు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో ములుగు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కళ్యాణి, డి ఆర్ డి ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, డిసిఓ వెంకటేశ్వర్లు, అన్ని విభాగాల జిల్లా అధికారులు, తహసిల్దార్ రాజు, ఎంపీడీవో మునవర్ బేగ్, అన్ని గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు  పాల్గొన్నారు.

🕒 28 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/every-application-received-in-praja-durbar-should-be-resolved/article-16021

Tags: