ఘనంగా తెలంగాణ చేనేత ఐక్య వేదిక సర్వ సభ్య సమావేశం.
సభ్యులకు దిశా నిర్దేశం - అందరు భాధ్యతతో వ్యవరించాలి. - రాపోలు వీర మోహన్
విశ్వంభర, యాదాద్రి భువనగిరి జిల్లా/ చౌటుప్పల్ మండలం:- దండు మల్కాపురం శ్రీశ్రీశ్రీ ఆందోల్ మైసమ్మ అమ్మవారి సన్నిధిలో తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ సర్వ సభ్య సమావేశం అధ్యక్షులు రాపోలు వీర మోహన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి అన్ని జిల్లాల నుండి రాష్ట్ర భాధ్యులు జిల్లాల బాధ్యులు పెద్ద సంఖ్యలో హాజరు అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు
రాపోలు వీర మోహన్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికుల సంక్షేమం కోసం పద్మశాలి జాతి చైతన్యం కోసం మన కృషి కొనసాగాలని కోరారు. అనేక జిల్లాలలో చేనేత కార్మికుల పరిస్థితులు చాలా దుర్భరంగా ఉన్నాయని చెప్పారు. మన సంస్థ ఆవిర్భావం తర్వాత చేనేత కార్మికుల సంక్షేమం కోసం అవిశ్రాంత పోరాటం చేస్తున్నామని తెలియ చేశారు. రాష్ట్ర కమిటీ లో ఉన్న సభ్యులు
జిల్లాల కమిటీ సభ్యులు భాధ్యతతో మీమీ ప్రాంతాలలో మీ జిల్లాల్లో చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం కృషి చేయాలని అదే సమయం లో పద్మశాలి జాతి చైతన్యం కోసం కృషి చేయాలని కోరారు. రాష్ట్రం లో చేనేత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని గత కొన్ని సంవత్సరాలుగా మనం అనేక సందర్భాలలో అనేక వేదికల మీద ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది అని, మన డిమాండ్ ఇప్పుడు సాకారం కాబోతుంది అని చెప్పారు. ఎన్నికల తరువాత సహకార సంఘాలకు నూతన జవసత్వాలు నింపి పాత క్యాష్ క్రెడిట్స్ రద్దు చేసి మరల రీ షెడ్యూల్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వచ్చే నెలలో నూతనంగా ఎన్నికైన చేనేత సహకార సంఘాల అధ్యక్షులకు తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ పక్షాన ఘన సన్మానం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సుమారు 110 మంది కార్య వర్గ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దేవరకొండ మున్సిపల్ చైర్మన్ గా విజయం సాధించిన పున్న శైలజకి కమిటీ పక్షాన ఘనంగా సన్మానించారు. విచ్చేసిన కమిటీ సభ్యులకు శాలువాలతో సత్కరించి మెమొంటో లను అందజేశారు. ఈ సమావేశం లో సీనియర్ ఉపాధ్యక్షులు గాజుల భగవాన్ నేత, ఎలిగేటి శ్రీనివాస్, కృష్ణ వేణి, వేముల ఉమా రాణి, సామల స్వప్న, చెన్నూరు విజయ లక్ష్మి, సిరాందాసు శివ, పార్వతి వేముల, రమ్య ,రుద్ర నాగ లక్ష్మి కోశాధికారి జెల్ల రఘు, గ్రేటర్ హైదరాబాద్ చేనేత అధ్యక్షులు ఏలే మహేష్ ప్రధాన కార్యదర్శి, చెరుకు విజయ్, నిజామాబాద్ జిల్లా కమిటీ అధ్యక్షులు తన్నీరు శ్రీనివాస్, మెరుగు శ్రీనివాస్, సిరిగాద మెస్సయ్య, గుడ్ల విష్ణు యువజన విభాగం అధ్యక్షులు అంకారపు మహేష్, గుంటక మహేశ్, గాజుల గంగ మల్లేశం, జడల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.