రాఘవేంద్ర కాలనీ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు వినతి

 విశ్వంభర, మహేశ్వరం : రాఘవేంద్ర కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మహేశ్వరం ఎమ్మెల్యేను కలిసి కాలనీలో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు పి. సత్యనారాయణ చారి, జాయింట్ సెక్రటరీ తెంబర వేణి ప్రసాద్ కాలనీలో ఎదురవుతున్న సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి శంషాబాద్ జోనల్ కమిషనర్ చంద్రకళకు సమస్యలను వెంటనే పరిశీలించి పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే సంబంధిత అధికారులకు కూడా అవసరమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రతినిధులు కాలనీలోకి ప్రవేశ ద్వారం వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను మార్చాలని, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను పెద్ద పైప్‌లైన్‌తో పునర్నిర్మించి మురుగునీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టాలని కోరారు. అదేవిధంగా కాలనీలో దెబ్బతిన్న రోడ్లను మరమ్మతు చేయడం, వీధి దీపాలను ఏర్పాటు చేయడం, డ్రైనేజీ సౌకర్యం లేని వీధుల్లో కొత్త డ్రైనేజీ వ్యవస్థను కల్పించడం, కృష్ణా తాగునీటి సరఫరాను నిరంతరాయంగా అందించి తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. కాలనీ ప్రజల సమస్యలను ప్రాధాన్యతతో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు రాఘవేంద్ర కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.

🕒 06 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/request-to-the-mla-to-solve-the-problems-of-raghavendra/article-18086

Tags: