కష్టానికి ఉడుతా భక్తిగా తోడుంటా
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
- లబ్దిదారులకు టీస్టాల్స్ అందజేత
విశ్వంభర, సిద్దిపేట: కష్టపడి పని చేసుకునే వారికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం, ప్రోత్సాహం ఉంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. నియోజకవర్గంలో హోటల్స్ నడుపుతూ ఉపాధి పొందుతున్న వారికి మరింత ఊతం ఇచ్చేందుకు తన వంతు సహాయంగా జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్దిదారులకు నెక్ సంస్థ సహకారంతో ఆదివారం టీస్టాల్స్ పంపిణీ చేశారు. ఒక్కో టీస్టాల్ రూ.80వేల విలువ ఉంటుంది. మొత్తం 91 టీ స్టాల్స్‌కు రూ.72లక్షలు ఖర్చు అయింది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ మీ కష్టానికి నావంతుగా తోడు.. ఉడుతా భక్తిగా స్టాల్స్ అందిస్తున్నట్టు చెప్పారు. టీస్టాల్ మీ కుటుంబానికి జీవనాధారమని చెప్పారు. నిజాయతీగా చేసే వ్యాపారం విజయానికి పునాది అవుతుందన్నారు. మీ వ్యాపారం మరింత వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. టీస్టాల్స్‌తో పాటు గ్యాస్ సిలిండర్, స్టవ్, ఎల్ఈడీ లైట్స్, ఫ్యాన్, 12స్పూన్స్, 12ప్లేట్స్, వాటర్ బాటిల్స్, 2కేజీ హాట్ కేస్, 3కేజీ డిక్ష, వాటర్ క్యాన్, చాకు, 2గిన్నెలను అందజేశారు.
సిద్దిపేట అంటే పచ్చదనం, పరిశుభ్రత
సిద్దిపేట అంటే పచ్చదనం, పరిశుభ్రత, ప్రజా రక్షణగా చేసుకున్నామని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని 3వ వార్డు బృందావన్ కాలనీలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను ప్రారంభించి మాట్లాడారు. హనుమాన్ దేవాలయం నిర్మాణానికి నా సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. పదేండ్లలో సిద్దిపేటను క్లిన్ అండ్ గ్రీన్, సేఫ్ సిద్దిపేటగా మార్చుకున్నామని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో ఏదైన సాధ్యమవుతుందనడానికి బృందావన్ కాలనీ ప్రజలు ఆదర్శమని చెప్పారు.