పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత

పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత

విశ్వంభర, సిద్దిపేట: ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రోశయ్య జయంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో వివిధ జిల్లాలకు చెందిన 200మంది విద్యార్థులకు రూ.5వేల చొప్పున మొత్తం రూ.10లక్షల రూపాయలు అందించారు. సిద్దిపేట జిల్లాకు చెందిన ఐదుగురు పేద విద్యార్థులకు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరావది లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ఒక్కొక్కరికీ రూ.5వేల చెక్కుతోపాటు మెడల్, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు గంప శ్రీనివాస్, సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి సముద్రాల హారినాథ్, విద్యా కమిటీ ఛైర్మన్ శివకుమార్, రాజకీయ కమిటీ ఛైర్మన్ ఆగిర్ వెంకటేష్, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అసోసియేట్ కార్యవర్గ సభ్యులు తడక లింగమూర్తి, నాయకులు పాల్గొన్నారు.

🕒 06 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/financial-assistance-to-poor-students/article-18064

Tags: