గొర్రెలు, మేకల కొట్టాలతో గ్రామస్తులకు ఇబ్బందులు
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలం దిల్వార్ గూడ గ్రామపంచాయతీ పరిధిలో గ్రామం మధ్యలో ఇళ్లకు సమీపంగా ఏర్పాటు చేసిన మేకలు, గొర్రెల కొట్టాల కారణంగా ప్రజలు అనారోగ్య సమస్యలుఎదుర్కొంటున్నారని దిల్వార్ గూడ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు వీటిపై చర్య తీసుకోవాలని గ్రామపంచాయతీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. అయినా గ్రామపంచాయతీ సిబ్బంది స్పందించకపోవడం వారిపై చర్య తీసుకోకపోవడం, గ్రామంలో మేకలు, గొర్రెల పెంపకం అధికంగా ఉండటంతో వాటి కొట్టాలను నివాసాల మధ్య ఏర్పాటు చేశారని గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో కొట్టాల పరిసరాల్లో అపరిశుభ్ర పరిస్థితులు నెలకొని దోమలు విపరీతంగాపెరుగుతున్నాయని పేర్కొన్నారు. దీంతో డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సాయంత్రం వేళల్లో దోమల బెడద అధికంగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. గ్రామపంచాయతీ అధికారులు వెంటనే స్పందించి ఇళ్ల మధ్య ఉన్న మేకలు, గొర్రెల కొట్టాలను గ్రామానికి దూరంగా తరలించే చర్యలు చేపట్టాలని కోరారు.