ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ని కలిసిన వరంగల్ క్లబ్ 

విశ్వంభర, హనుమకొండ:  ఇటీవల జరిగిన వరంగల్ క్లబ్ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కమిటీ సభ్యులు ఈరోజు ఉదయం బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వరంగల్ క్లబ్ సెక్రటరీ డాక్టర్ పి. ప్రవీణ్, జాయింట్ సెక్రటరీ బి. కన్నా రెడ్డి, ట్రెజరర్ పి. సుధీర్ కుమార్, అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు గట్టు రాజు, చంద్రప్రకాశ్ రెడ్డి, కళ్యాణ్ రెడ్డి, సునీల్ రెడ్డి, పల్లం రవి, శ్రీధర్ రెడ్డి, డాక్టర్ ప్రవీణ్ కుమార్, అజ్మీర రాజేష్, గోనె చెన్నారెడ్డి తదితరులు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నూతన కమిటీ సభ్యులందరినీ శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. వరంగల్ క్లబ్ మరింత అభివృద్ధి చెందుతూ సామాజిక, క్రీడా, సాంస్కృతిక రంగాల్లో విశిష్ట సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, క్లబ్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పాల్గొన్నారు.

🕒 02 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/warangal-club-where-mla-naini-met-rajender-reddy/article-17614

Tags: