డాక్టర్ బి. రవీందర్ నాయక్ కు వైద్య శిరోమణి అవార్డు ప్రధానం
విశ్వంభర, బషీర్ బాగ్ : తల్లిదండ్రులు ప్రాణం పోస్తే, పునర్జన్మ ప్రసాదించేది వైద్యులేనని, మానవాళి మనుగడకు వైద్యుల సేవలు మరువలేనివని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి. రవీందర్ నాయక్ అన్నారు. బుధవారం కోఠీ లోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం (భారతరత్న డాక్టర్ బి సి రాయి జయంతిని) పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. భారతరత్న డాక్టర్ బి సి రాయ్ జీవితాన్ని వైద్యులు స్ఫూర్తిగా తీసుకొని రోగరహిత సమాజ స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.భగవంతుడితో సమానమైనది వైద్యవృత్తి అని, పేద రోగులకు వైద్యులు మానవత దృక్పథంతో నిస్వార్ధంగా సేవలు అందించాలని తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ జియోగ్రఫీ డిపార్ట్మెంట్ అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ మహమ్మద్ అక్తర్ అలీ మాట్లాడుతూ పగలు రాత్రి లేకుండా అవిశ్రాంతంగా పనిచేస్తూ సొంత అవసరాలను సైతం త్యాగం చేసి ఎందరో జీవితాలను కాపాడుతున్న వైద్యుల సేవలు మరువలేనివని అన్నారు. లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సమర్పన్ డైరెక్టర్ లయన్ . ప్రేమ్ చంద్ జైన్ మాట్లాడుతూ రోగికి వైద్యుడికి ఉన్న సంబంధం ఎంతో గొప్పదన్నారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి. రవీందర్ నాయక్ ను తెలంగాణ రాష్ట్రం నుండి ఒక్కరికి ఇచ్చే వైద్య శిరోమణి అవార్డును తెలంగాణ మేధావులు ఫోరం రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ శాలువా, పూలమాల, పుష్పగుచ్చం, జ్ఞాపిక ప్రశంసాపత్రంతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పద్మజ అడిషనల్ డైరెక్టర్, డాక్టర్ శివ బాలాజీ జాయింట్ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్ అడ్మిన్ శశి శ్రీ , జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సూపర్ నా కోఆర్డినేటర్లుకె. రవీందర్ ,బిచ్చుకారి సూర్య , జి.వేణుగోపాల్, విద్యాసాగర్ లు పాల్గొని డాక్టర్ రవీందర్ నాయక్ వైద్య సేవల గురించి వివరించి అభినందనలతో పాటు శుభాకాంక్షలు తెలిపారు