డాక్టర్స్ డే సందర్భంగా 52 మంది వైద్యులకు సత్కారం

విశ్వంభర, గజ్వేల్: డాక్టర్స్ డే సందర్భంగా చైతన్య స్రవంతి సాహితీ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్‌లోని సురభి దయాకర్ రావు ఫార్మసీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో 52 మంది వైద్యులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, డాక్టర్ యాదవ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వాణిదేవి మాట్లాడుతూ వైద్య వృత్తి అత్యంత బాధ్యతాయుతమైనదని, సమాజ సేవలో వైద్యుల పాత్ర అమూల్యమని అన్నారు. ప్రతి ఏడాది ఇదే కళాశాలలో డాక్టర్స్ డే నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. ఎమ్మెల్సీ యాదవ రెడ్డి మాట్లాడుతూ వైద్యులను ఒకే వేదికపై సన్మానించడం అభినందనీయమని కొనియాడారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు సీనియర్ వైద్యులు మాట్లాడుతూ వైద్యుల సేవలను గుర్తించి సత్కరించడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఇదే వేదికపై సామాజిక సేవలకు గుర్తింపుగా బండారు రాంప్రసాద్ రావుకు "మాతృభూమి" సంస్థ సేవారత్న బిరుదు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వైద్యులు, ఐఎంఏ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

🕒 02 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/52-doctors-felicitated-on-doctors-day/article-17638

Tags: