రూ.17.01 కోట్లతో నల్గొండ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు వేగవంతం
విశ్వంభర, నల్గొండ: అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద నల్గొండ రైల్వే స్టేషన్‌ను రూ.17.01 కోట్ల వ్యయంతో ఆధునికీకరిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో చేపట్టిన ఈ పనులు తుది దశకు చేరుకున్నాయి.సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని నల్గొండ రైల్వే స్టేషన్ ప్రతిరోజూ సుమారు 3 వేల మంది ప్రయాణికులకు సేవలందిస్తుండగా, రోజుకు 44 రైళ్లు ఈ స్టేషన్‌లో రాకపోకలు సాగిస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఇది కీలక రవాణా కేంద్రంగా ఉంది. పునరాభివృద్ధి పనుల్లో 12 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ప్లాట్‌ఫారాలపై అదనపు షెడ్లు, ప్లాట్‌ఫారమ్‌ల అభివృద్ధి, కాన్‌కోర్స్ ఆధునికీకరణ, విఐపీ లాంజ్, వెయిటింగ్ హాల్స్, మరుగుదొడ్లు, దివ్యాంగులకు అనుకూల సౌకర్యాలు, ఆధునిక సూచిక బోర్డులు, ఫర్నిచర్, స్టేషన్ ముఖద్వారం అభివృద్ధి వంటి పనులు చేపట్టారు. ఇప్పటికే ప్లాట్‌ఫారాలపై షెడ్లు, లిఫ్టులు, ప్లాట్‌ఫారమ్ ఉపరితల అభివృద్ధి, అప్రోచ్ రోడ్డు, పార్కింగ్, స్టేషన్ ప్రాంగణం, వెయిటింగ్ హాల్స్ పనులు పూర్తయ్యాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జి, స్టేషన్ ఫసాడ్, దివ్యాంగుల సౌకర్యాల పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ పునరాభివృద్ధి పూర్తయిన అనంతరం నల్గొండ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు మరింత మెరుగైన, ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.