అయ్యప్ప స్వామి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
విశ్వంభర, పరిగి : పట్టణంలోని అయ్యప్ప కాలనీలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. పరిగి నియోజకవర్గం, జిల్లా ప్రజలందరూ శ్రీ ధర్మశాస్త అయ్యప్ప స్వామి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఆలయ వ్యవస్థాపకులు,శాశ్వత చైర్మన్ పాలాది శ్రీనివాస్ గుప్తా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ని శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రజిత వెంకటేష్, సిద్ధాంతి పార్థసారథి, అయ్యప్ప ఆలయ శాశ్వత చైర్మన్ పాలాది శ్రీనివాస్ గుప్తా, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకట్ రాములు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, కోఆప్షన్ సభ్యులు ఆంజనేయులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కృష్ణ, చిన్న నరసింహులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.