విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు
విశ్వంభర, రామన్నపేట: విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని బెస్ట్ సేవా సొసైటీ వ్యవస్థాపకులు బుక్కా ఈశ్వరయ్య అన్నారు. బుధవారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, కక్కిరేణి గ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్, ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు డైరీలు, భోజనం ప్లేట్స్, స్టేషనరీ తదితర సామాగ్రి అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రదానోపాద్యాయులు సి.యచ్.రాజన్ బాబు మాట్లాడుతూ, స్వంత ఊరి మమకారంతో, బెస్ట్ సేవా సోసైటి వ్యవస్థాపకులు బుక్కా ఈశ్వరయ్య హైస్కూల్, ప్రైమరీ స్కూల్ విద్యార్ధులకు ప్రతి సంవత్సరం సహయ సహకారాలు అందించడం గర్వించదగ్గ విషయమని అన్నారు. వీరి సేవలను గుర్తించి ప్రభుత్వం నుండి గొల్డ్ మెడల్ పొందిన ఈశ్వరయ్య సేవలు మరువలేనివని, దాతల సహకారాలతోనే గ్రామాలలో గల స్కూల్స్ కూడ కార్పోరేట్ స్కూల్స్ కు దీటుగా ఉతీర్ణత సాధిస్తున్నాయని, ఇలాగే దాతలు ముందు కొచ్చి సహకరిస్తే ఉతీర్ణత శాతం మెరుగు పడుతదని కోనియాడారు. బెస్ట్ సేవా సొసైటీ ఫౌండర్ బుక్కా ఈశ్వరయ్య మాట్లాడుతూ, విద్యార్థులు రాజకీయాల జోలికి పోకుండా శ్రద్దగా చదువుకోవాలని, ప్రభుత్వం చాల ఖర్చు చేసి నాణ్యతమైన విద్య అందించాలనే ఉద్దేశంతో డ్రెస్సులు, బుక్స్, బోజన వసతి కల్పిస్తున్నదని, దానికి తోడు సేవా సంస్థల నుండి సహకారాలు పొందాలని కోరారు. ప్రాథమిక పాఠశాల ప్రదానోపాద్యాయులు బి.ఉపేందర్ జీ మాట్లాడుతూ, గ్రామం నుండి తల్లిదండ్రులు పిల్లలకు ఇంగ్లీష్ నెర్పుతారని ఆశతో లక్షలు వెచ్చించి ప్రక్క పట్టణాలకు పంపడం బాధాకరమని, వారికి దీటుగా మన ఊరి స్కూలులో కూడ ఇంగ్లీష్ నేర్పుతున్నామని, గురుకుల పాఠశాలలో సీట్లు పొందడం మన పాఠశాల ముందు ఉందన్న లక్ష్యం అని పేర్కొన్నారు.