లక్నాపూర్ ప్రాజెక్టును పరిశీలించిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
విశ్వంభర, పరిగి: మండల పరిధిలోని లక్నాపూర్ ప్రాజెక్టును పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి పర్యాటక శాఖ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, లక్నాపూర్ ప్రాజెక్టును ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పర్యాటకులను ఆకర్షించేలా మౌలిక సదుపాయాలు, వినోద సౌకర్యాల కల్పనతో పాటు ప్రాంత అభివృద్ధికి అవసరమైన చర్యలపై చర్చించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకట్రాములు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, కోఆప్షన్ సభ్యులు సభ్యులు ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకులు చిన్న నరసింహులు, రాజ పుల్లారెడ్డి, బాలు, తదితరులు పాల్గొన్నారు.