మహిళల సాధికారతకు మహిళా భవనం దోహదం: జంగపల్లి ఐలయ్య

విశ్వంభర, అక్కన్నపేట : అక్కన్నపేట మండలం జనగాం గ్రామంలో మహిళా సంఘాల అభివృద్ధి కోసం నిర్మించనున్న మహిళా భవనానికి బుధవారం ఘనంగా భూమిపూజ నిర్వహించారు. అనంతరం గ్రామంలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని హుస్నాబాద్ డివిజన్ ఆత్మ చైర్మన్ జంగపల్లి ఐలయ్య, హుస్నాబాద్ సహకార సంఘం వైస్ చైర్మన్ ఎగ్గడి ఐలయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా జంగపల్లి ఐలయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. మహిళా భవనం నిర్మాణంతో మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, స్వయం ఉపాధి అవకాశాలు మరింత విస్తరించనున్నాయని పేర్కొన్నారు. అలాగే ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి అర్హుడైన ఓటరు సద్వినియోగం చేసుకుని, ఓటరు జాబితాలో తమ వివరాలను పరిశీలించి అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవాలని సూచించారు. ఎగ్గిడి ఐలయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడైన వ్యక్తి తన పేరు ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు. మహిళా భవనం గ్రామ మహిళల సాధికారతకు కేంద్రంగా మారాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బి. ఈశ్వర్, ఉప సర్పంచ్, గ్రామ శాఖ అధ్యక్షుడు వల్లపు పరశురాములు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🕒 02 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/jangapalli-ilaiyya-contributes-to-the-empowerment-of-women/article-17660

Tags: