ఇళ్ల స్థలాల కోసం సిపిఐ కలెక్టరేట్ ముట్టడి
- ట్రాక్టర్ ఫై గుడిసె వేసి ఇంటి నమూనాలతో వినూత్న ప్రదర్శన
- 40 మంది సిపిఐ నేతల అరెస్ట్
విశ్వంభర, మహబూబాబాద్ : బుధవారం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇంటి స్థలాలు, ఇళ్ల పట్టాల కోసం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు . ఈ సందర్భంగా ట్రాక్టర్పై గుడిసె వేసి ఇంటి నమూనాలతో వినూత్న ఆందోళన నిర్వహించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 40 మంది సిపిఐ నేతలను అరెస్టు చేసి టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆందోళనలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీపీఐ జిల్లా కార్యదర్శి బి విజయసారథి మాట్లాడుతూ, ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేవరకు సిపిఐ పోరాటం ఆగదన్నారు. జిల్లా కేంద్రంలో వందలాది ప్రభుత్వ స్థలాలు ఉన్న ప్రభుత్వం నిరుపేదలకు ఇంటి స్థలాలు పంచడం లేదన్నారు జిల్లా కేంద్రంలో రియాల్టర్లు భూ కబ్జా కారులు అక్రమంగా ధరణి భూ భారతి పేరిట రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు అన్నారు. ప్రభుత్వానికి మరియు జిల్లా అధికారులకు కళ్ళు కనిపించట్లేవా అన్నారు. పేదలు 80 గజాల్లో గుడిసెలు వేసుకుంటే అక్రమంగా కూల్చేసి కేసులు పెడతారా అని హెచ్చరించారు వెంటనే సిపిఐ నేతలు గుడిసె వాసులపై అక్రమ కేసులు ఎత్తివేసి నిరుపేదలకు ఇంటి స్థలాలు పంచాలన్నారు జిల్లా కేంద్రంలో వేలాదిమందికి ఇంటి నెంబర్లు ఇంటి పట్టాలు లేవన్నారు. గత ప్రభుత్వం పదివేల మంది అప్లై చేసుకుంటే కేవలం 600 మందికి ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు ఇందిరమ్మ పేరిట ఈ ప్రభుత్వం ఇంటి పట్టాలు ఉంటేనే ఇస్తామంటున్నారు కానీపి ప్రభుత్వం ఇంతవరకు ఇంటి పట్టాలు ఇవ్వడం లేదన్నారు. వెంటనే ప్రభుత్వం ఇంటి పట్టాలు ఇంటి నెంబర్లు ఇవ్వాలన్నారు జిల్లా కేంద్రంలో సుమారు పదివేల రూపాయలు ఇంటికి రాయిలు కట్ట ఇక ఇబ్బందుల పాలు కొంతమంది ఆత్మహత్యల పాలవుతున్నారన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలన్నారు. ఇంటి స్థలాలు పేదలకు పంచకపోతే సిపిఐ ఆధ్వర్యంలో దశల వారి ఉద్యమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు ఆందోళన ఉద్రిక్తత మధ్య సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయ సారధి లతో సహా 40 మంది సిపిఐ నేతల్ని అరెస్టు చేసి టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఆందోళనలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి అజయ్, సారధి రెడ్డి నన్ను సుధాకర్ రెడ్డి, కట్టబోయిన శ్రీనివాస్, నేతలు పెరుగు కుమార్, దేశ పల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, మామిళ్ల సాంబలక్ష్మి, కట్లోజు పాండురంగాచారి, వరిపల్లి వెంకన్న, నెల్లూరు నాగేశ్వరరావు,ఆ తండా సందీప్, నరా శ్రావణ్, వెలుగు శ్రావణ్ ,మేక వీరన్న, తురక రమేష్, సమ్మయ్య, ఆబోతు అశోక్, మహమూద్ చిరంజీవి, పాల్ , వెంకటరెడ్డి, చిర్ర సత్యనారాయణ, భూక్య హరి, అన్నం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.