ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి: ఆర్. కృష్ణయ్య
విశ్వంభర, అశోక్‌నగర్ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసి, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాదు అశోక్‌నగర్‌లోని నగర కేంద్ర గ్రంథాలయంలో బుధవారం నిరుద్యోగులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకుని అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, మున్సిపాలిటీలు ఏర్పడినప్పటికీ వాటికి అవసరమైన అదనపు పోస్టులను సృష్టించి భర్తీ చేయడం లేదని విమర్శించారు. పదవీ విరమణలు, పదోన్నతుల వల్ల ఖాళీ అయిన పోస్టులను కూడా భర్తీ చేయడం లేదన్నారు. పోలీస్ శాఖలో 18 వేల పోస్టులు, విద్యాశాఖ పరిధిలో ప్రభుత్వ, గురుకుల, ఆదర్శ, కస్తూర్బా, ఎయిడెడ్ పాఠశాలల్లో సుమారు 30 వేల ఉపాధ్యాయ పోస్టులు, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 2,800 బోధనా పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అలాగే గ్రూప్-1లో 1,600, గ్రూప్-2లో 3,000, గ్రూప్-3, గ్రూప్-4లో 20 వేల పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన పోస్టులు మంజూరు చేసి, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోటా ప్రకారం అన్ని ఖాళీలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు, ఉద్యోగాల భర్తీపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ఉద్యోగ నియామకాల వార్షిక క్యాలెండర్ విడుదల చేయాలని, మెగా డీఎస్సీ, పోలీస్, గ్రూప్స్, జేఎల్‌ఎం, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఏఈ, ఏఈఈ తదితర పోస్టులకు వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలని, నిరుద్యోగ భృతి అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులపై నమోదైన కేసులను ఎత్తివేసి, వారి సమస్యలపై ముఖ్యమంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలు రాజేందర్, మోదీ రాందేవ్, నిఖిల్ పటేల్, నిరుద్యోగ జేఏసీ నాయకులు శంకర్ నాయక్, నరేష్, ఇంద్ర, రవి నాయక్, కుమార్, రవి యాదవ్, సవాయ్ సింగ్, దామోదర్ రెడ్డి, మధుసూదన్ గౌడ్, శ్రీకాంత్, ఉష, దివ్య, కల్పన, వెంకట్, నిఖిల్ , రాజేందర్ పోటీ పరీక్షల అభ్యర్థులు పాల్గొన్నారు.