10న విద్యాసంస్థల బంద్‌కు పిలుపు
విశ్వంభర, హిమాయత్ నగర్ : రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం జూలై 10న కెజీ నుంచి పీజీ వరకు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. హైదరాబాదు హిమాయత్ నగర్ లోని ముఖ్ధూం భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఖాళీ పోస్టుల భర్తీ, మౌలిక వసతుల కల్పన, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల విడుదల, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణతో పాటు విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బంద్‌ను విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.