ఏజెన్సీ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి మంత్రి సీతక్క చొరవ చూపాలి
: టీయూడబ్ల్యూజే (ఐజేయు)
విశ్వంభర, కొత్తగూడ: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయు) ఆధ్వర్యంలో కొత్తగూడ మండలంలో సభ్యత్వ పునరుద్ధరణ, నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. మండల అధ్యక్షుడు ఎస్.కె. సల్మాన్ పాషా అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యుడు దూలం శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు చిత్తనూరి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి గాడిపెళ్లి శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చిత్తనూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, జర్నలిస్టుల ఐక్యతే యూనియన్ బలోపేతానికి పునాదని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు రవాణా, మౌలిక సదుపాయాల కొరతతో పాటు అనేక వృత్తిపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్ర మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ చూపి ఏజెన్సీ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం యూనియన్ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం సభ్యత్వాల పునరుద్ధరణ, నూతన సభ్యత్వాల నమోదు చేపట్టగా, జిల్లా, మండల నాయకులు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.