"కుడా" రెండేళ్ల అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ ను అందజేసిన ఇనగాల
విశ్వంభర, హనుమకొండ: వరంగల్ కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించి విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా రూపొందించిన "2 ఇయర్ ప్రోగ్రెస్, అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్" ను ఈరోజు హైదరాబాద్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి కి మర్యాదపూర్వకంగా కలిసి అందజేశారు. ఈ ప్రగతి నివేదికలో గత రెండు సంవత్సరాల కాలంలో వరంగల్ మహా నగర పరిధిలో సాధించిన కీలక మౌలిక వసతుల కల్పన, మాస్టర్ ప్లాన్ విస్తరణ, ల్యాండ్ పూలింగ్ విజయాలు, కాళోజీ కళాక్షేత్రం వంటి పెండింగ్ ప్రాజెక్టుల పూర్తితో పాటు భవిష్యత్తులో వరంగల్‌ను ఐటీ, పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు చేపట్టబోయే కార్యాచరణను ఛైర్మన్ నాయకత్వానికి క్షుణ్ణంగా వివరించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా కుడా సంస్థను ఆర్థిక స్వాలంబన వైపు నడిపిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు , టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ , కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ పింగిలి వెంకట్రామ్ నరసింహ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొని కుడా చైర్మన్ కి అభినందనలు తెలియజేశారు.