అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు : ఎమ్మెల్యే కాలేరు
విశ్వంభర, కాచిగూడ : అభివృద్ధి పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సూచించారు. అంబర్‌పేట్ నియోజకవర్గంలోని కాచిగూడ డివిజన్ మనియార్‌పాటి ప్రాంతంలో రూ.5.35 లక్షలతో, మోతి మార్కెట్ అంబాజీ గల్లీలో రూ.4 లక్షలతో చేపట్టనున్న నూతన సీవరేజ్ పైప్‌లైన్, మంచినీటి పైప్‌లైన్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పనులు పూర్తయిన అనంతరం స్థానికులకు మురుగునీటి సమస్యలు తగ్గడంతో పాటు పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడతాయని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో: మాజీ కార్పొరేటర్ కన్నె ఉమా రమేష్ యాదవ్ అధికారులు పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.