అనుమానాస్పద స్థితిలో వ్యక్తి  మృతి

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి  మృతి

విశ్వంభర, మహబూబాబాద్:   అ నుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ మండలంలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ రూరల్ సీఐ అంజలి తెలిపిన వివరాల ప్రకారం, మండలంలోని సింగారం గ్రామానికి చెందిన పిట్టల యాకయ్య (57) యశోద భార్య భర్తలు. వీరికి ఇద్దరు సంతానం. వృత్తిరీత్యా హైదరాబాదులో ఉంటున్నారు. యాకయ్యకు వేరే మహిళతో అక్రమ సంబంధం ఉన్నదని భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. యశోద భర్తను యాకయ్యను ఎప్పటికైనా చంపేస్తానని అంటూ ఉండేది. ఈ క్రమంలో బుధవారం రాత్రి  12: 30 సమయంలో యాకయ్య ను పదునైన ఆయుధాలతో ముఖంపై విచక్షణ రహితంగా కొట్టి చంపారని, యాకయ్య తండ్రి సోమయ్య అనుమానం వ్యక్తం చేస్తూ ఈ హత్య తన కోడలు పిట్టల యశోద, గంగుల కృష్ణ మరి కొంతమంది కలిసి చేయవచ్చని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అంజలి తెలిపారు.

🕒 02 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/death-of-a-person-under-suspicious-circumstances/article-17654

Tags: