విబిజిరాంజీ ని రద్దు చేయాలని ఎంపీడీవోకు వినతి

విశ్వంభర, నెల్లికుదురు :కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన విబిజి రాంజీని వెంటనే రద్దు చేయాలని, ఎఫ్ఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని  వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సిఐటియు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఎంపీడీవో సింగారపు కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గునిగంటి రాజన్న మాట్లాడుతూ, ఉపాధి హామీలో పాత విధానంతో పని కల్పించాలని,మేట్ల వ్యవస్థను పునరుద్ధరించాలని,ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని,కనీస వేతనం రూ.600 చెల్లించాలని,ఫోటోలు,సమయ శరతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతకు మునుపు మండలంలోని నైనాల,నెల్లికుదురు,మదనతుర్తి, మునిగలవీడులో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇసంపల్లి సైదులు,పెరుమాండ్ల బాబు గౌడ్, బాణాల యాకయ్య,బండ వెంకన్న,తోటయాకయ్య, కొమురయ్య,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

🕒 02 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/request-to-mpdo-to-cancel-vbjiranji/article-17628

Tags: