రావిరాలలో తెలంగాణ భూ భరోసా గ్రామసభ
విశ్వంభర, నెల్లికుదురు: తెలంగాణ భూ భరోసా గ్రామసభ మండలంలోని రావిరాల గ్రామంలో సర్పంచి కత్తుల కళ్యాణి అధ్యక్షతన బుధవారం జరిగింది. దీనికి రెవెన్యూ ఇన్స్పెక్టర్ దార రామమూర్తి తో పాటు సర్వేయర్, జిపిఓ ప్రభృతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ రైతులకు సంబంధించిన భూ సరిహద్దులు తదితర సమస్యలను పరిష్కరించుకోవడానికి భూభరస గ్రామసభలను సద్వినియోగం చేసుకోవాలని కర్షకులకు సూచించారు. ఉపతహసిల్దార్ శ్రీనాథ్ మాట్లాడుతూ గ్రామ సరిహద్దులు ఫైల్స్ ఆధారంగా వ్యవహరించి జిల్లా గెజిట్లో నోటిఫికేషన్ ప్రచురించడం జరుగుతుందన్నారు.సిఆర్ఓఎస్ నెట్వర్క్ జిఎన్ఎస్ఎస్ పరికరాలను ఉపయోగించి గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లను సేకరిస్తారని చెప్పారు.రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో పట్టాదారుల సమక్షంలో క్షేత్రస్థాయి ప్రభుత్వ,వ్యక్తిగత భూములను గుర్తించడం జరుగుతుందన్నారు. భూ రిజిస్టర్ కొరిలేషన్ సెటిల్మెంట్స్ ఎల్పీఎంలు గ్రామ మ్యాపులను సిద్ధం చేసి యు ఎల్ పి ఐ ఎన్ భూధార్ నంబర్లను కేటాయించడం జరుగుతుందని సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ దార రామకృష్ణ, రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు.