నూతన ప్రీ ప్రైమరీ తరగతి గది ప్రారంభోత్సవం

విశ్వంభర, హనుమకొండ: ప్రాథమిక పాఠశాల సిద్దాపూర్ పాఠశాల నందు ఈరోజు ప్రభుత్వం సాంక్షన్ చేసిన ప్రీ ప్రైమరీ సెక్షన్ తరగతి గదిని గ్రామ సర్పంచ్  బొక్క హరీష్, స్కూల్ కాంప్లెక్స్ సిద్ధాపూర్ ప్రధానోపాధ్యాయులు  రవికుమార్  ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రీ ప్రైమరీ విద్యార్థులందరికీ ఉచితంగా పలకలు బలపాలు అందించి విద్యార్థులకు అక్షరాభ్యాసo చేయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ బొక్క హరీష్, ఉప సర్పంచ్ ప్రసన్నక్రాంతి,  స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రవికుమార్, ప్రాథమిక పాఠశాల సిద్దా పూర్ ఎ ఎ పి సి  చైర్ పర్సన్ అనూష,ఉ న్నత పాఠశాల ఎ ఎ పి సి  చైర్పర్సన్ మాధవి , వార్డు సభ్యులు,  ఎస్ఎంసి మాజీ చైర్మన్ రామకృష్ణ, గ్రామ పెద్దలు, తాబేటి మహేష్ , అంగన్వాడి ఉపాధ్యాయురాలు స్రవంతి, లక్ష్మీ,  విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రముఖులు, ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.  ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన వారందరికీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రం శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం ఆకినపల్లి శ్రీధర్, ఇల్లందుల శ్రీదేవి మేడం , గట్టు రాములు కృతజ్ఞతలు తెలిపారు.

🕒 02 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/inauguration-of-new-pre-primary-classroom/article-17678

Tags: