ఘనంగా ముకేష్ గౌడ్ జయంతి
విశ్వంభర,అంబర్‌పేట : మాజీ మంత్రి ముకేష్ గౌడ్ జయంతి సందర్భంగా అంబర్‌పేటలోని మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్‌లో శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, బాగ్ అంబర్‌పేట్ డివిజన్ అధ్యక్షుడు రావుల సుధాకర్, గడ్డం శ్రీధర్, కోటం అనిల్ కుమార్, బండ అశోక్, రాకేష్, హరీష్, సందీప్ తదితరులు ముకేష్ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ముకేష్ గౌడ్ ప్రజా సేవకు అంకితభావంతో పనిచేసిన నాయకుడని కొనియాడారు. బీసీల సంక్షేమం, అభివృద్ధికి అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొంటూ, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.