కాంగ్రెస్ మండలాధ్యక్షునికి సన్మానం
విశ్వంభర, సైదాపూర్ :సైదాపూర్ మండల అధ్యక్షుడిగా ఇటీవల నూతనంగా ఎన్నికైన చాడ కొండల్ రెడ్డిని , మాజీ మండల అధ్యక్షులు దొంత సుధాకర్ ను రాయికల్ తండా పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడికి నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. మండలంలో పార్టీ బలోపేతానికి నూతన అధ్యక్షుడు చాడ కొండల్ రెడ్డి సమర్థవంతంగా కృషి చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని ఆకాంక్షించారు. మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ ఛైర్మన్ నేదండ్ల రాజ్ కుమార్, ఏఎంసీ డైరెక్టర్ చిన్న వెంకటేశం, మాజీ జేపీటీసీ గుండరపు శ్రీనివాస్, డిసిసి సెక్రటరీ భిక్షపతి నాయక్, యూత్ కాంగ్రెస్ మండల సెక్రటరీ తిరుపతి నాయక్, భీమా నాయక్, రాజా మొగిలి, రాములు నాయక్, శ్రీ రామ్ నాయక్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.