ఎర్రకుంట మైసమ్మకు ఘనంగా వనభోజనాలు 

ఎర్రకుంట మైసమ్మకు ఘనంగా వనభోజనాలు 

విశ్వంభర, ఇనుగుర్తి: మండలంలోని చిన్ననాగారంలోని ఎర్రకుంట మైసమ్మ తల్లికి  గ్రామస్తులంతా  వనభోజనాలకు బుధవారం తరలి వెళ్లారు. అంతకు మునుపు మైసమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి గ్రామస్తులు కోళ్లు, పొట్టేళ్ల తో మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా గ్రామస్తులు వర్షాలు బాగా కురిసి, పాడిపంటలతో కళకళలాడా లని, మంచి ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారిని కోరుకున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ యాకయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆరుద్ర కార్తె లో మహిమాన్విత ఎర్రకుంట మైసమ్మకు గ్రామంలోని రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు వనభోజనాలకు వెళ్లడం పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ క్రమంలో మైసమ్మ తల్లికి వనభోజనాలకు గ్రామ ప్రజలు వెళుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచి తుమ్మనపల్లి సతీష్ చారి,మాజీ సర్పంచి బైరు చిన్న బాలయ్య, వార్డు సభ్యులు బైరు వెంకన్న, బొమ్మర లచ్చయ్య,వడపల్లి సందీప్,బైరు సంపత్ గౌడ్, జొన్నలగడ్డ కార్తీక్ రెడ్డి,బింగి శరత్ గౌడ్, చెడు పాక యాకూబ్,నాయిని కొమురయ్య యాదవ్, బింగి యాకయ్య,వడపల్లి కొండయ్య,గుండ్ల యాకయ్య, గుండ్ల నరసయ్య,చెడుపాక శ్రీను,వరిపెల్లి మురళి తదితరులు పాల్గొన్నారు.

🕒 02 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/errakunta-maisamma-feasts-on-wild-food/article-17622

Tags: