వి.జి.బి రాంజీ పథకం రద్దు చేయాలి
విశ్వంభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని జిల్లా వ్యవసాయ కూలీల సంఘం ఉపాధ్యక్షులు సిర్పంగి స్వామి , జిల్లా రైతు సంఘం సహాయ కార్యదర్శి కందడి సత్తిరెడ్డిలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే చర్యలను విరమించి, గ్రామీణ పేదలకు ఉపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వి.జి.బి.రాంజీ జీ పథకాన్ని రద్దు చేయాలని వారు కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం,కేంద్ర కమిటీల పిలుపు మేరకు బుధవారం మండల పరిధిలోని వలిగొండ, కెర్చుపల్లి, పులిగిల్ల గ్రామాల్లో ఉపాధి కూలీలు,రైతులు కార్మికుల తో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,గ్రామీణ పేదల జీవనాధారమైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే చర్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఏడాదికి 100 రోజుల ఉపాధిని సమర్థవంతంగా కల్పించాలని, పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని, కూలీల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు దయ్యాల మల్లేశం, కొండూరు సత్తయ్య, మారబోయిన నరసింహ, సత్తిరెడ్డి, నర్సిరెడ్డి,దొడ్డి యాదగిరి,సునీత, రాములమ్మ,లక్ష్మి, యాదమ్మ, వసంత, కౌసల్య, తదితరులు పాల్గొన్నారు.