పరిగి నియోజకవర్గానికి రూ.251.20 కోట్లతో గ్రామీణ రహదారులు:  ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

విశ్వంభర, పరిగి: పరిగి నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.251.20 కోట్ల పరిపాలనా ఆమోదం తెలిపిందని ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి తెలిపారు. అలాగే పరిగి, దోమ, మొహమ్మదాబాద్ మండలాల్లో కొత్త ఎమ్మార్వో కార్యాలయాల నిర్మాణానికి రూ.6.75 కోట్లు (ఒక్కో భవనానికి రూ.2.25 కోట్లు) మంజూరైనట్లు వెల్లడించారు. పత్రికా సమావేశంలో మాట్లాడుతూ, పంచాయతీరాజ్ శాఖ ద్వారా 15 గ్రామీణ రహదారుల అభివృద్ధికి సుమారు రూ.35 కోట్లు, రోడ్లు-భవనాల శాఖ ద్వారా 7 ప్రధాన రహదారుల విస్తరణ, బలోపేతానికి రూ.184.15 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. అదనంగా గండీడ్, మొహమ్మదాబాద్ మండలాల్లో అంతర్గత రహదారుల కోసం రూ.20 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఈ పనులతో మొత్తం 22 రహదారులపై 106.98 కిలోమీటర్ల మేర అభివృద్ధి జరుగుతుందని, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, అత్యవసర వైద్య సేవలు పొందే ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పరిగి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, మరిన్ని నిధులు తీసుకువచ్చి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. అలాగే సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ చేపట్టినట్లు తెలిపారు.

🕒 02 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mla-rammohan-reddy-for-rural-roads-at-rs-25120-crore/article-17682

Tags: