మాలపల్లిలో సీసీ నిఘా..  గ్రామ భద్రతకు ఆధునిక అడుగు

విశ్వంభర, హుస్నాబాద్ : హుస్నాబాద్ మండలంలోని మాలపల్లి గ్రామంలో ప్రజల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. హుస్నాబాద్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో సీఐ శ్రీనివాస్, ఎస్సై లక్ష్మారెడ్డి ప్రత్యేక చొరవతో గ్రామ సర్పంచ్ వెన్న స్వర్ణలత, రాజు ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా గ్రామంలోకి వచ్చే, వెళ్లే వాహనాలు మరియు ప్రజల రాకపోకలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అవకాశం కలిగింది. ఈ నిఘా వ్యవస్థతో దొంగతనాలు, అవాంఛనీయ సంఘటనలు, రోడ్డు ప్రమాదాలను అరికట్టడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ మరింత సమర్థవంతంగా సాగుతుందని సర్పంచ్ వెన్న స్వర్ణలత తెలిపారు. గ్రామ ప్రజలు కూడా భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ బంక చందు, ఉప సర్పంచ్ బత్తుల శ్రీనివాస్, వార్డు సభ్యులు బత్తుల వీరస్వామి, గుండాల ప్రశాంత్, బత్తుల కవిత, వెన్న శారద, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సతీష్, సరస్వతి దేవి, సీఏ వెన్న శ్రీనివాస్, యువజన సంఘం అధ్యక్షుడు గొల్ల రవితేజ, ఫీల్డ్ అసిస్టెంట్ బత్తుల రేణుక, ఆశా వర్కర్ వెన్న రాజేశ్వరి, రేషన్ డీలర్ బత్తుల సునీత, ఉపాధి హామీ మేట్ బత్తుల రాణి, వెన్న శ్రీమతి, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

🕒 02 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/cctv-surveillance-in-malapally-is-a-modern-step-towards-village/article-17636

Tags: