అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో వంగాల సుజాత బాలరాజ్ గౌడ్ లకు ఘన సన్మానం
విశ్వంభర, హైదరాబాద్ : అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలోని ఫిల్లీ ఎక్స్‌పో సెంటర్‌లో నిర్వహించిన మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ కార్యక్రమంలో ఆదర్శ కిరణం మాసపత్రిక ప్రధాన సంపాదకులు వంగాల సుజాత, వంగాల బాలరాజ్ గౌడ్‌లను ఘనంగా సన్మానించారు. ప్రజలకు ఆదర్శ మ్యాట్రిమోనీ ద్వారా అన్ని వర్గాల వారికి నాణ్యమైన సేవలు అందించడంతో పాటు ఆదర్శ కిరణం మాసపత్రిక ద్వారా సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు చేస్తున్న విశిష్ట కృషిని గుర్తించి మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపకులు గణగోని శ్రీనివాస్, అధ్యక్షులు, ఖజాంచి శ్రీధర్ గుడాల, కార్యనిర్వాహక అధ్యక్షుడు కిరణ్‌తో పాటు ఇతర నిర్వాహకులు శాలువా, జ్ఞాపికలతో వారిని సత్కరించారు. అదేవిధంగా ఎం.ఏ.టి.ఏ. కార్యక్రమాల విజయవంతమైన నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న పావన్ వంగాలను సైతం సన్మానించి అభినందించారు.