మొక్కలు పర్యావరణాన్ని పరిరక్షిస్తాయి : వెంకన్న
విశ్వంభర, తార్నాక : వైద్యులు ప్రాణాలను కాపాడినట్లే మొక్కలు పర్యావరణాన్ని పరిరక్షిస్తాయని టీజీఎస్‌ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్, ఇంజినీరింగ్ , మెడికల్) సిహెచ్. వెంకన్న అన్నారు. టీజీఎస్‌ఆర్టీసీ సికింద్రాబాదు తార్నాక ఆసుపత్రిలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిహెచ్. వెంకన్న మాట్లాడుతూ వైద్య వృత్తి సమాజానికి ఎంతో విలువైనదని, వైద్యులు అందించే నిస్వార్థ సేవ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆసుపత్రి ప్రాంగణంలో ప్రతి వైద్యుడు ఒక మొక్కను నాటారు. ప్రజల ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా అందించారు. ఈ కార్యక్రమంలో: టీజీఎస్‌ఆర్టీసీ తార్నాక ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్, సూపరింటెండెంట్ డాక్టర్ శైలజా మూర్తి మెడికల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ పి. శ్రీనివాస్ కార్పొరేషన్ సీనియర్ వైద్యులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.