పదవి విరమణ పొందిన ఉద్యోగులను సన్మానించిన టీఎన్జీవోస్
విశ్వంభర, బషీర్ బాగ్ : హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ (డీఈఓ) కార్యాలయంలో సేవలు అందించి పదవీ విరమణ పొందిన జూనియర్ అసిస్టెంట్ లక్ష్మీపతి, ఆఫీస్ సబార్డినేట్ శంకర్‌లకు ఘనంగా వీడ్కోలు పలుకుతూ పదవీ విరమణ కార్యక్రమాన్ని టిఎన్జీవోస్ యూనియన్ అసోసియేట్ ప్రెసిడెంట్, టిఎన్జీవోస్ యూనియన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీజీ ఫోరం అధ్యక్షుడు కే. ఆర్ రాజ్ కుమార్, సెక్రెటరీ ఎం భాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సహాయ సంచాలకులు శ్రీనివాస్ రెడ్డి హాజరై, పదవీ విరమణ పొందిన ఉద్యోగులను శాలువాలు, పుష్పహారాలతో ఘనంగా సన్మానించారు. వారి సుదీర్ఘ సేవలను కొనియాడుతూ భవిష్యత్ జీవితం ఆయురారోగ్యాలతో, ఆనందంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, ఫిరోజ్ అహ్మద్, ముజ్జైద్, ప్రియదేవ్ ఠాకూర, రమేష్, అరుణ జ్యోతి, విజయలక్ష్మి, సుగుణారెడ్డి, రాజేందర్, శ్రీకాంత్, అర్చన, ప్రవీణ, హేమావతి, రామకృష్ణారెడ్డి కనీజ్ ఫాతిమా, ఉమాదేవి, మధునిక, అన్వర్ బషీర్ అహ్మద్ లు పదవీ విరమణ పొందిన లక్ష్మీపతి, శంకర్‌లను అభినందించి వారి సేవలను ప్రశంసించారు.