వైఎల్‌ఎన్‌ఎస్ ట్రాక్టర్ యూనియన్ నూతన కార్యవర్గం
విశ్వంభర, గుండాల: గుండాల మండలంలోని పెద్ద పడిశాల గ్రామంలో వైఎల్‌ఎన్‌ఎస్ ట్రాక్టర్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గడ్డం ప్రశాంత్, ఉపాధ్యక్షుడిగా కోడిపెల సతీష్, ప్రధాన కార్యదర్శిగా బొడ్డు రజినీకాంత్, సహాయ కార్యదర్శిగా కడారి అనిల్, చిట్టి సలహాదారుగా బుర్ర గణేష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను యూనియన్ సభ్యులు అభినందించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్ల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం, యూనియన్ అభివృద్ధి కోసం సమిష్టిగా కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఎన్నికల కార్యక్రమంలో వైఎల్‌ఎన్‌ఎస్ ట్రాక్టర్ యూనియన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని నూతన కార్యవర్గానికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు