గుండాల పోలీస్ స్టేషన్ ఎస్పీ ఆకస్మిక తనిఖీ
విశ్వంభర, గుండాల: యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్‌పీ) బుధవారం గుండాల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి సమగ్ర తనిఖీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్‌లో నిర్వహిస్తున్న రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, స్టేషన్ నిర్వహణ, మౌలిక వసతులు, శాంతిభద్రతల పరిరక్షణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు సత్వర, పారదర్శక, నాణ్యమైన పోలీసు సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఎస్‌పీ ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా స్పందించాలని, మహిళలు, చిన్నారులు, వృద్ధులకు సంబంధించిన కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అలాగే నేరాల నియంత్రణలో భాగంగా క్షేత్రస్థాయిలో మరింత అప్రమత్తంగా పనిచేసి శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని పోలీసు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. గుండాల పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) శోభన్ బాబు ఆధ్వర్యంలో స్టేషన్ సిబ్బంది క్రమశిక్షణతో, సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్న తీరును జిల్లా ఎస్‌పీ అభినందించారు. ఇదే నిబద్ధతతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ తనిఖీలో డీఎస్పీ పి. శ్రీనివాస్ నాయుడు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. శంకర్, గుండాల ఎస్‌ఐ శోభన్ బాబుతో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.