ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి
విశ్వంభర, బాగ్ లింగంపల్లి: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి, 10 వేల ర్యాంక్ నిబంధనను రద్దు చేసి, అర్హులైన ప్రతి విద్యార్థికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయాలని బీసీ జేఏసీ జాతీయ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు పాటికొండ విక్రం గౌడ్ అధ్యక్షతన జరిగిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పరిరక్షణ రౌండ్‌టేబుల్ సమావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వల్ల వేలాది మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం పొందారని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పలు నిబంధనల కారణంగా అర్హులైన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను పేరుకుపోయేలా చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. బకాయిల కారణంగా కళాశాలలు విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేస్తున్నాయని, దీంతో అనేక మంది విద్యార్థులు చదువులు మధ్యలోనే మానేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, స్కాలర్‌షిప్‌లను సకాలంలో చెల్లించాలని, రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే కళాశాల బంద్, అనంతరం చేపట్టనున్న "చలో హైదరాబాదు" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యార్థులు, ప్రజాసంఘాలు, తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో: బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ జేఏసీ కో చైర్మన్ కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక రాష్ట్ర అధ్యక్షుడు బెక్కర్ల శ్రీనివాస్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నాగేశ్వరరావు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జావిద్, బీజేవైఎం అధికార ప్రతినిధి సురేష్ గౌడ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడారి స్వామి యాదవ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నరసింహ నాయక్, ఓయూ జేఏసీ చైర్మన్ మాలింగ లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.