మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ
విశ్వంభర, చిక్కడపల్లి : చెట్టును కాపాడితే చెట్టు మనల్ని కాపాడుతుంది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు పచ్చని వాతావరణాన్ని అందించాలని పర్యావరణ ప్రకృతి ప్రేమికుడు డాక్టర్ చిక్కా దేవదాసు అన్నారు. హైదరాబాదు చిక్కడపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వనమహోత్స వాన్ని పురస్కరించుకుని ప్రజలు, ప్రభుత్వాలు విస్తృత స్థాయిలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి పేరుతో అడవులను నరికి పర్యావరణానికి హాని కలిగించే నిర్మాణాలు, పరిశ్రమలు పెరగడం వల్ల అటవీ సంపద నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చెట్ల పెంపకం వల్ల పర్యావరణ సమతుల్యం నెలకొని వాయు కాలుష్యం తగ్గడంతో పాటు వర్షపాతం, భూసార పరిరక్షణకు దోహదపడుతుందని తెలిపారు. చెట్లను విచక్షణారహితంగా నరకడం వల్ల ఉష్ణోగ్రతలు పెరగడం, పక్షులు, జంతువులు నివాసాలు కోల్పోవడం, భూగర్భ జలాల మట్టం తగ్గడం వంటి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరిస్తూ, మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు.